: క్రికెటర్ శ్రీశాంత్ ను ఇంకా వెంటాడుతున్న కష్టాలు!


తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు తీర్పును వెలువరించిన తర్వాత కూడా క్రికెటర్ శ్రీశాంత్ కు కష్టాలు తొలగలేదు. శ్రీశాంత్ పై నిషేధాన్ని ఎత్తివేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ లో బీసీసీఐ అప్పీల్ చేసింది. బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ, కేరళ హైకోర్టు ఆర్డర్ ను తమ లీగల్ టీమ్ అధ్యయనం చేసిందని... ఈ ఆర్డర్ ను కేవలం ఏకసభ్య బెంచ్ మాత్రమే ఇచ్చిందని... ఈ నేపథ్యంలో హైకోర్టులోని పెద్ద బెంచ్ కు అప్పీల్ చేసుకునే అవకాశం తమకు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశామని చెప్పారు.

2013లో జరిగిన ఐపీఎల్ సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్ పై బీసీసీఐ జీవితకాల నిషేధాన్ని విధించింది. ఈ బ్యాన్ ను గత సోమవారం నాడు కేరళ హైకోర్టు ఎత్తివేసింది. టీమిండియా తరపున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.

  • Loading...

More Telugu News