: ఈ జన్మలో సీఎం కాలేననే అక్కసుతోనే ఉన్మాదిగా మారారు.. ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలి: జగన్ పై యనమల ఫైర్


వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ జన్మలో ముఖ్యమంత్రిని కాలేననే అక్కసుతో ఆయన ఉన్మాదిలా మారారని విమర్శించారు. ఆయన ఉన్మాదం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. సీఎంను కాలేననే కసితో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ, ప్రజలకు కీడు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష నేతగా ఉంటూనే రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నాయకులకు స్థానం లేదని... జగన్ పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిని బహిరంగంగా చంపాలని జగన్ పిలుపునిస్తున్నారని... ఎన్నికల సంఘానికి ఇంతకన్నా ఆధారం ఏమి కావాలని ప్రశ్నించారు. చంద్రబాబును ఎన్ని తిట్లు తిడితే, అన్ని ఓట్లు పడతాయని జగన్ కు ఎవరో చెప్పినట్టున్నారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News