: ఆ క్షిపణులా?... జపాన్ ను కూడా దాటలేవు: తీసిపారేసిన అమెరికా
ఉత్తర కొరియా హెచ్చరించినట్టుగా హవ్సాంగ్-12 క్షిపణులు తమ అధీనంలోని గువామ్ ను ఏమీ చేయలేవని, కేవలం రెచ్చగొట్టడం తప్ప ఆ రాకెట్ లాంచర్లతో యుద్ధం కాని పనని అమెరికా అధికారులు చెబుతున్నారు. అవి షిమోనో, హిరోషిమా, కైచీ ప్రావిన్స్ మీదుగా గువామ్ చేరుకోవాల్సి వుంటుందని వెల్లడించిన ఓ సైన్యాధికారి, గరిష్ఠంగా 3,356 కిలోమీటర్ల దూరం అవి ప్రయాణిస్తాయని, మార్గమధ్యంలో జపాన్ వాటిని స్వయంగా అడ్డుకోగలదని తెలిపారు. గువామ్ కు 40 కిలోమీటర్ల దూరంలోనే వాటిని పేల్చి వేస్తామని తెలిపారు.
ఇక క్షిపణి ప్రయోగమే జరిగితే, చావును కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరించారు. గువామ్ వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్షిపణి విధ్వంసక వ్యవస్థలున్నాయని, వాటి కళ్లుగప్పడం అసాధ్యమని తెలిపారు. అమెరికా ఇప్పటికే ఎన్నో ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొందని, ఉత్తర కొరియా దాడిని తాము లెక్కలోకి తీసుకోబోమని, అదసలు జరిగే పనే కాదని తెలిపారు. కాగా, ఈ నెల మధ్యలో గువామ్ పై విరుచుకుపడతామని ఉత్తర కొరియా కటువు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.