: కోర్టు హాల్ లో కన్నీరు పెట్టుకున్న వేధింపుల వికాస్ బరాల!


ఛండీగఢ్ లో ఐఏఎస్‌ అధికారి కుమార్తె వర్ణికా కుందును కారులో వెంబడించి, వేధింపులకు పాల్పడిన వికాశ్ బరాలా న్యాయస్థానంలో కన్నీరుపెట్టుకున్నాడు. ఇటీవల అతను పోలీసుల ముందు లొంగిపోయిన నేపథ్యంలో, వికాశ్ ను పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతుండగా వికాశ్ బరాలా కన్నీటిపర్యంతమయ్యాడు. రెండు రోజుల పోలీస్ కస్టడీలో, ఆమెను అనుసరించి, వేధించినట్టు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో వికాశ్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలన్నీ ఉన్నాయని, ఆయనకు గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష పడేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News