: క్రిస్ గేల్ బ్యాటింగ్ చేస్తుంటే.. దానికి తనే కామెంటరీ చేస్తే ఎలా ఉంటుందో చూడండి!


వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఎలా ఆడుతాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ కు దిగాడంటే ప్రత్యర్థి బౌలర్ ఒళ్లు దగ్గరపెట్టుకుని బౌలింగ్ చేయాల్సిందే. సిక్సర్లతో చెలరేగే గేల్ తాను బ్యాటింగ్ చేసే సమయంలో తనే కామెంటరీ చెబితే ఎలా ఉంటుంది? అన్న చిలిపి ఆలోచన ఫాక్స్ స్పోర్ట్స్ కు వచ్చింది.

దీంతో కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) ప్రమోషన్‌ కోసం గేల్ బ్యాటింగ్ కు వస్తే, దానికి తనే కామెంటరీ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. ఈ సందర్భంగా గేల్ కామెంటరీ చేస్తూ.. ‘ఓహ్‌ క్రిస్‌ గేల్‌.. తుపాను బ్యాటింగ్‌ చేయడానికి నడుచుకుంటూ వెళ్తొంది. పరిస్థితి దారుణంగా ఉండనుంది. అక్కడున్న బౌలర్‌ కు నా క్షమాపణలు. వారంతా చేతులు కదుపుతూ ఉత్కంఠగా ఉన్నారు. క్రిస్‌ గేల్‌.. సీజీ.. కమాన్‌. అదీ గేల్‌ సత్తా. అక్కడ చూడండి’ అంటూ కామెంటరీ చేసి అందర్నీ నవ్వించాడు. 

  • Loading...

More Telugu News