: జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా హిందీ రీమేక్‌లో ర‌ణ్‌వీర్ సింగ్!


పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ 'టెంప‌ర్‌'ను హిందీలో రీమేక్ చేయ‌నున్నారు. బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఆ సినిమాలో హీరోగా న‌టించ‌నున్నాడు. ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నటుడు, నిర్మాత, బిజినెస్‌మేన్ సచిన్ జోషి గ‌తేడాదే కొన్నారు. ప్రముఖ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నాడు. ప్ర‌స్తుతం రణ్‌వీర్ సింగ్... సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పద్మావతి సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆ సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే ర‌ణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో న‌టించ‌నున్నాడు. 

  • Loading...

More Telugu News