: అమెజాన్ లో నోకియా 6 స్మార్ట్ ఫోన్లకు ఇప్పటికే 10 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్లు
ఈ నెల 23వ తేదీన ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సైట్ లో నిర్వహించనున్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ కి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్‌కి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 10 లక్షలు దాటినట్టు అమెజాన్ ఇండియా పేర్కొంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో లభ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999.
నోకియా 6 ఫీచర్లు...
- 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వడ్ గ్లాస్ డిస్‌ప్లే
- 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
- ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
- 3 జీబీ ర్యామ్
- 32 జీబీ స్టోరేజ్
- 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 7.1 నూగట్
- హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
- 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
- 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్
- బ్లూటూత్ 4.1