: 'ఢిల్లీ' ఢమాల్!!


సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు స్వంత మైదానంలో రెచ్చిపోయారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ లైనప్ ను 80 పరుగులకే కుప్పకూల్చారు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఏ దశలోనూ సన్ రైజర్స్ బౌలర్లకు దీటైన పోటీ ఇవ్వలేకపోయింది. బ్యాట్స్ మెన్ ఒకరి వెంట మరొకరు పెవిలియన్ కు బారులు తీరారు. సెహ్వాగ్ (8), కెప్టెన్ జయవర్ధనే (11), ఉన్ముక్త్ చాంద్ (17), వార్నర్ (8) విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో సామీ, స్టెయిన్, పెరీరాలు తలో రెండు వికెట్లతో ఢిల్లీ వెన్నువిరిచారు.

  • Loading...

More Telugu News