: 175 కార్లకు టోల్ చెల్లించకుండా వెళ్లిపోయిన అఖిలేశ్ యాదవ్ బృందం... వీడియో చూడండి!
తన రాజకీయ ప్రాబల్యాన్ని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తప్పుగా వాడుకున్నారు. బారబంకీలోని అహ్మద్‌పూర్ టోల్ ప్లాజా వద్ద తన క్యాంపెయిన్‌లోని 175 కార్లు టోల్ చెల్లించకుండా వెళ్లడం అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. వీళ్లంతా సమాజ్‌వాదీ నాయకుడు రాజ్‌బలి యాదవ్ విగ్రహావిష్కరణ కోసం ఫైజాబాద్ వెళ్తుండగా ఈ వీడియో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లంతా అఖిలేశ్‌పై మండిపడుతున్నారు. దీనిపై అఖిలేశ్ స్పందిస్తూ - `ఒకవేళ నా మద్దతుదారులు నిబంధనలు అతిక్రమించినట్లు రుజువు చేస్తే టోల్ మొత్తం నేను చెల్లిస్తాను` అని ప్రకటించారు.