: ఉమ్మడి పాలకులు మనకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఉండేవారు కాదు: కేసీఆర్
నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పోచంపాడులోని ఎస్సార్సీపీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 8 టీఎంసీల నీరు మాత్రమే ఉందని అన్నారు. 1996లో శ్రీరాంసాగర్ కట్ట మీదకు వచ్చి చూస్తే ఎంతో బాధ వేసిందని అన్నారు. ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా పూర్తి చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు లోపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కాళేశ్వరం నీళ్లతో నింపడం ఖాయమని అన్నారు. రైతాంగం బ్రహ్మాండంగా పంటలు పండించుకునే అవకాశం కల్పిస్తామని అన్నారు.
మోసపూరిత మాటలతో ఆనాటి పాలకులు కాలయాపన చేశారని కేసీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నుంచి ఉత్తరం వైపునకు చూస్తే ఆదిలాబాద్ ఉంటుందని, ఆదిలాబాద్‌ను నాలుగు జిల్లాలుగా చేశామని అన్నారు. ఆదిలాబాద్ మిడ్ ఇరిగేషన్ వ్యవస్థను బాగు చేస్తున్నామని అన్నారు. అలాగే మంచిర్యాల జిల్లాకు కూడా నీరందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గోదావరి నీటిని చక్కగా ఉపయోగించుకునేట్లు చేస్తామని చెప్పారు. ఉమ్మడి పాలకులు మనకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఉండేవారు కాదని అన్నారు.