: ఘనంగా పరిటాల శ్రీరామ్ వివాహ నిశ్చితార్థం.. సందడి చేసిన బాలయ్య
దివంగత పరిటాల రవి, మంత్రి పరిటాల సునీతల కుమారుడు శ్రీరామ్, ఆలం జ్ఞానల నిశ్చితార్థం ఈ రోజు హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయరంగ ప్రముఖులు తరలి వచ్చారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలో సందడి చేశారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, అనంతపురం జెడ్పీ ఛైర్మన్ చమన్ తదితరులు హాజరయ్యారు. శ్రీరామ్, జ్ఞానల వివాహం అక్టోబర్ 1వ తేదీన జరగనుంది.