: గెలుపును నమ్మలేకపోయిన ఆటగాడు... `ఒకసారి గిల్లవా!` అంటూ ఫొటోగ్రాఫర్‌ని రిక్వెస్ట్ చేసిన వైనం!
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల హర్డిల్స్ ఆటలో తను సాధించిన విజయాన్ని నమ్మలేక, పక్కనే ఉన్న ఫొటోగ్రాఫర్‌ను `ఇది నిజమేనా? ఒకసారి నన్ను గిల్లవా!` అని రిక్వెస్ట్ చేశాడు నార్వేకు చెందిన అథ్లెటిక్స్ ఆటగాడు కార్ల్‌స్టన్ వార్‌హోమ్. గత 30 ఏళ్లలో నార్వే అథ్లెటిక్స్ చరిత్రలో ఎవరూ సాధించని విజయాన్ని చేజిక్కించుకున్న కార్ల్‌స్టన్ ఆ విషయాన్ని నమ్మలేకపోయాడు. విజేతగా తమ దేశపతాకంతో స్టేడియంలో అభిమానులకు కరచాలనం చేస్తూ, మీడియా దగ్గరికి రాగానే ఓ ఫొటోగ్రాఫర్‌ను పిలిచాడు. అతను సందేహిస్తూ ముందుకు వచ్చాడు. అప్పుడు కార్ల్‌స్టన్ `నేను నిజంగా గెలిచానా? ఇదంతా నిజమేనా? ఒకసారి గిల్లవా!` అంటూ చేయి ముందుకు చాచాడు. దానికి ఫొటోగ్రాఫర్ ముందు ఆశ్చర్యపోయినా తర్వాత కార్ల్‌స్టన్ చెప్పినట్టుగా చేసి, తన అనుమానాన్ని దూరం చేశాడు.