: ఆ మాత్రం కారం పడదా భూమా..?: ఉప ఎన్నికల ప్రచారంలో ఫన్నీ ఇన్సిడెంట్ ను చూడండి!
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారిగా పోటీ పడుతున్న భూమా బ్రహ్మానందరెడ్డి, తన భార్య ప్రతిభా రెడ్డితో కలసి ప్రచారాన్ని నిర్వహిస్తున్న వేళ, ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన ప్రచారంలో పలువురు మహిళలు పూలు చల్లి ఆశీర్వదించగా, ఓట్లను అభ్యర్థిస్తూ, ముందుకు సాగుతున్న వారు ఓ మిర్చి బజ్జీ వ్యాపారి ఉన్న ప్రాంతానికి వెళ్లారు.
ఆ సమయంలో వేడివేడిగా అప్పుడే తయారైన మిర్చి బజ్జీలను సదరు వ్యాపారి వీరికి అందించాడు. మిర్చిలో ఘాటు మరింతగా ఎక్కువైందో ఏమో వాటిని తినేందుకు వారు కొంత ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ప్రతిభ, ఓ ముక్క కొరికేందుకూ కష్టపడినట్టు కనిపించారు. ఇక పక్కనున్న వారు కారం తింటే మంచిదని, రాయలసీమలో కారం వాడకంపై కామెంట్లు చేస్తుండటం కూడా వినిపించింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.