: వికెట్ పడిన అనంతరం నా సంబరాల వెనుక స్పూర్తి అదే: షోయబ్ అఖ్తర్


పాకిస్థాన్ పేసర్ షోయబ్ అక్తర్ కు వివాదాలతో సావాసం బాగా అలవాటు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా వివాదాస్పద ప్రవర్తనతో షోయబ్ ఎన్నోసార్లు జట్టులో స్థానం కోల్పోయాడు. దురుసు వ్యాఖ్యలు, దూకుడు వైఖరి కారణంగా ఎన్నోసార్లు మందలింపులు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరొందిన షోయబ్ పాక్ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. వికెట్ తీసిన ప్రతిసారి షోయబ్ దూసుకుపోయి సంబరాలు జరుపుకునేవాడు.

వాయువేగంతో బంతులు సంధించే అఖ్తర్ వికెట్ పడగానే రెండు చేతులు బార్లా చాపి ఆనందంతో వేగంగా పరుగెత్తేవాడు. ఇలా పరుగెత్తడం వెనుక స్పూర్తి పాకిస్థాన్ అమ్ములపొదిలోని ఎఫ్ 16 యుద్ధ విమానాలని తెలిపాడు. తన చిన్నతనంలో ఎఫ్ 16 సహా మిరాజ్ వంటి విమానాలు తన ఇంటిపైనుంచి వెళ్లిపోయేవని అన్నాడు. వాటిల్లో ఎఫ్ 16 అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అవి వెళ్లే విధానంలోనే తాను కూడా వికెట్ తీసిన తరువాత దూసుకుపోయేవాడినని షోయబ్ తెలిపాడు. ఈ సందర్భంగా తన ఖాతాలో పలు ఫోటోలను పోస్టు చేశాడు. 

  • Loading...

More Telugu News