: హైదరాబాద్ పై తొలి మానవ బాంబు దాడిలో నిందితులంతా నిర్దోషులే... కోర్టు తీర్పు వెల్లడి


హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన తొలి మానవబాంబు దాడిలో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది నిందితులూ నిర్దోషులేనని, వారికీ ఘటనలో ప్రమేయం ఉన్నట్టుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి తన తీర్పును వెలువరించారు. 2005లో బేగంపేటలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై మానవ బాంబుదాడి జరిగిన సంగతి తెలిసిందే.

బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాది తనను తాను బాంబుతో పేల్చేసుకోగా, అతనితో పాటు హోంగార్డు సత్యనారాయణ ఈ ఘటనలో మృతి చెందాడు. మొత్తం 20 మందిని కేసులో నిందితులుగా చేర్చగా, 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు మరణించగా, మరో ఏడుగురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. సుమారు 12 సంవత్సరాల పాటు విచారణ జరుగగా, ఇప్పుడు నిందితులంతా నిర్దోషులేనని తీర్పు వెలువడింది.

  • Loading...

More Telugu News