: కోపంతో కేకలేయాలని యాంకరే అడిగింది!: సంచలనం సృష్టించిన టీవీ9 ఇంటర్వ్యూపై రానా
టాలీవుడ్ హీరో రానా, తనను డ్రగ్స్ దందాపై ప్రశ్నించిన టీవీ9 మహిళా యాంకర్ పై సీరియస్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో కోపంతో చూస్తూ, యాంకర్ పై చిటికలు వేస్తూ, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయవద్దని సీరియస్ గా ఆయన వార్నింగ్ ఇవ్వడంతో యాంకర్ బిత్తర చూపులు చూడగా, రానాకు అంత ఆగ్రహం ఎందుకని నెటిజన్లు ప్రశ్నించారు కూడా.
అయితే, ఈ వీడియో అంతా ఫేక్ అని, ప్రోమో కట్ కోసం యాంకర్ చెప్పినట్టుగా తాను చేశానని రానా స్వయంగా అంగీకరించాడు. "సార్, మీరు నిజంగానే టీవీ 9 యాంకర్ పై ఆగ్రహాన్ని చూపారా? లేక అది పబ్లిసిటీ కోసమా?" అని ఓ అభిమాని ప్రశ్నించగా, "ఆమే అలా చెప్పాలని సూచించింది. ప్రోమో కట్ కోసమే ఇదంతా" అని రానా ఈ ఉదయం 9:43 గంటల సమయంలో సమాధానం ఇచ్చాడు.