: బ్యాంకు ఖాతాదారులూ తెలుసుకోండి... ఈ నెలలో రెండుసార్లు వరుస సెలవులు!
ఈ నెలలో మరో 21 రోజులు మిగిలివుండగా, రెండుసార్లు బ్యాంకులకు వరుస సెలవులు వస్తుండటంతో, తమ తమ లావాదేవీలను ఆయా సెలవు తేదీలకు అనుగుణంగా ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. 12 నుంచి 15 వరకూ నాలుగు రోజుల పాటు, ఆపై 25 నుంచి 27 వరకూ మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.
12వ తేదీన రెండో శనివారం, ఆపై ఆదివారం, సోమవారం నాడు కృష్ణాష్టమి, మంగళవారం నాడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుస సెలవులు. ఆపై 25వ తేదీ శుక్రవారం నాడు వినాయక చవితి, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం రానున్నాయి. వీటితో పాటు 19వ తేదీ ఆదివారం కూడా సెలవు. అంటే, ఆగస్టులో మరో 20 రోజులు మిగిలుండగా, అందులో 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయబోవడం లేదన్నమాట.