: వేడెక్కిన నంద్యాల... రంగంలోకి బాలకృష్ణ... పవన్ ను కూడా దింపేందుకు టీడీపీ ప్రయత్నం


నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభ్యర్థిని గెలిపించుకుని ప్రజలు తమవెంటే ఉన్నారన్న సంకేతాలను పంపాలని భావిస్తున్న వైకాపా, అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారన్న నినాదంతో తెలుగుదేశం పార్టీలు ప్రచారంలో ముందుకు సాగుతున్న వేళ, సినీ గ్లామర్ ను కూడా జోడించాలని టీడీపీ నిర్ణయించింది. రాయలసీమ ప్రాంతంలో అమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి బాలకృష్ణను కనీసం మూడు నుంచి నాలుగు రోజుల పాటు ప్రచారం నిమిత్తం తీసుకురావాలని తెలుగుదేశం భావిస్తోంది. ఇందుకు బాలయ్య కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

 ఇక బాలయ్యతో పాటు 2014లో తమకు అనుకూలంగా ప్రచారం చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను కూడా నంద్యాలలో తమ తరఫున పోటీ చేసే అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసేలా చూడాలని భావిస్తోంది. ఇక ఆయన ప్రచారానికి రాలేనని చెబితే, కనీసం మీడియా ముఖంగానైనా, తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలా చూడాలన్నది టీడీపీ అధిష్ఠానం యోచనని సమాచారం.

  • Loading...

More Telugu News