: పేద విద్యార్థులకు 'తానా' స్కాలర్ షిప్.. దరఖాస్తులకు ఆహ్వానం
అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం 'తానా' ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఉన్నత విద్య కోసం రాష్ట్రం నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, స్కాలర్ షిప్ ఆశించేవాళ్ళు అమెరికా ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్శిటీలు ఇచ్చే ఐ20 సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ జులై 25. పూర్తి వివరాలకు www.tana.org వెబ్ సైట్ ను దర్శించాలని తానా ప్రతినిధులు తెలిపారు.