: చోరీ కేసులో.. హిందీ 'బిగ్ బాస్ రియాలిటీ' షో ఫేం, వివాదాస్పద సాధువు స్వామి ఓం అరెస్టు!


హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పేరు సంపాదించుకున్న వివాదాస్పద స్వామిజీ ఓంను న్యూఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని లోధి కాలనీలో తన సైకిల్ దుకాణం తాళాలు పగుల గొట్టి అందులోని 11 సైకిళ్లు, వాటి విడి భాగాలు, తన ఇంటి సేల్ డీడ్ ను స్వామి ఓం ఎత్తుకెళ్లిపోయాడంటూ ప్రమోద్ ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమోద్ ఝా... స్వామి ఓంగా, తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న వినోదానంద ఝాకు స్వయానా సోదరుడు కావడం విశేషం.

న్యాయస్థానం ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న స్వామి ఓంని ఢిల్లీలోని భజనపురాలో అదుపులోకి తీసుకున్నారు. కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు, పనులు చేయడం ద్వారా పలుమార్లు పలువురి చేతుల్లో దెబ్బలు తిన్న స్వామి ఓం ఎట్టకేలకు అరెస్టు కావడం విశేషం. 

  • Loading...

More Telugu News