: మైనర్ భార్యతో బలవంతపు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
భార్యతో భర్త బలవంతపు శృంగారం (మారిటల్ రేప్) పై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేమని పేర్కొంది. మైనర్ అయిన భార్యతో శృంగారాన్ని నిబంధనలు అనుమతించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. భారత శిక్షా స్మృతి 375 ప్రకారం.. భార్య వయసు 15 ఏళ్ల లోపు ఉంటే కనుక ఆమె అంగీకరించినా, లేకపోయినా ఆమెతో శృంగారం నేరం అవుతుందని, కానీ ఆమె వయసు 15-18 ఏళ్ల మధ్య ఉంటే మాత్రం అప్పుడు ఆమె అంగీకారంతో పనిలేకుండా శృంగారంలో పాల్గొన్నా దానిని నేరంగా పరిగణించలేమని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.