: జర్నలిస్టును తిడుతూ 63 వేల ట్వీట్లు చేసిన తమిళ హీరో విజయ్ అభిమానులు!


బాలీవుడ్ బాద్షా షారూఖ్ సినిమా 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' సినిమాను చూసిన బెంగళూరుకు చెందిన మహిళా జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ తీవ్ర నిరాశచెందారు. దీంతో ఇంటికి వచ్చి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె పంచుకున్నారు. గతంలో తమిళ నటుడు విజయ్‌ నటించిన 'సురా' మూవీలా 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' సినిమా ఉందని ఆమె పేర్కొన్నారు. కనీసం ఇంటర్వెల్ వరకు కూడా థియేటర్లో ఉండలేకపోయానని ఆమె తెలిపింది.

దీంతో విజయ్ అభిమానులకు ఆగ్రహం వచ్చేసింది. 'మా హీరో సినిమాను విమర్శిస్తావా?' అంటూ సుమారు 63 వేల ట్వీట్లు చేశారు. ఇందులో ఆమెను బెదిరిస్తూ కూడా పలు ట్వీట్లు ఉండడం విశేషం. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెకు హెచ్చరికలు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. మరోపక్క, సినిమాను విమర్శిస్తే అభిమానులకు వచ్చే నష్టం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

  • Loading...

More Telugu News