: పార్టీ విప్ ను ధిక్కరించిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన అధిష్ఠానం


నిన్న గుజరాత్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా తమ పార్టీ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌కు ఓటువేయాలని ఆ పార్టీ అధిష్ఠానం విప్‌ జారీ చేసింది. కానీ, 14 మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి బీజేపీకి ఓటు వేశారు. వారిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. వారిని ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. వేటుప‌డిన వారిలో మహేంద్ర వాఘెలా, రాఘవ్‌జీ పటేల్‌, అమిత్‌ చౌదరీ, బోలాబాయ్‌ గోహిల్‌, సీకే రౌల్జీ, కామ్సీ మక్వానా, హకుబా జడేజా, త‌దిత‌ర నేత‌లు ఉన్నారు. ఈ విష‌యాన్ని గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ అశోక్‌ గెహ్లాట్  మీడియాకు వివ‌రించారు.             

  • Loading...

More Telugu News