: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన దిలీప్ కుమార్
ప్రముఖ సినీ నటుడు దిలీప్ కుమార్ (94) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్ ను గతవారం ఆయన కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన కొద్దిరోజుల్లోనే పూర్తిగా కోలుకోవడంతో, కాసేపటి క్రితం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.