: మీరు చాలా ప్రయత్నించారు కానీ..ఆ బెల్ట్ నా దగ్గరుంది: రోహిత్ శర్మ వైరల్ ట్వీట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో డబ్ల్యూడబ్ల్యూఆర్ క్రీడాకారుడు గ్రేట్ ఖలీతో ఫోటో దిగి పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖలీ ముందు చిన్నపిల్లాడిలా ఉన్నావంటూ అభిమానులు వ్యాఖ్యానించారు. అయితే ఆ రోజు కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, హార్డిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కూడా ఖలీని కలిశారు. ఈ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్టు చేసిన రోహిత్ శర్మ 'భలేగా ప్రయత్నించారు సహచరులారా... అయినా ఉపయోగం ఏంటి? ఖలీ బెల్టు నా దగ్గరుంది' అంటూ సరదా వ్యాఖ్యల జతచేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.