: సైకిల్‌పై వెళుతున్న‌ ఇంటర్‌ అమ్మాయిని అడ్డుకుని చంపేసిన యువ‌కులు


సైకిల్ పై క‌ళాశాల‌కు వెళుతున్న ఓ ఇంట‌ర్ అమ్మాయిని ఐదుగురు యువ‌కులు అడ్డ‌గించి వేధించిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో దారుణంగా క‌త్తితో పొడిచిచంపేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, బాజా అనే గ్రామానికి చెందిన రగ్నీ దుబే (17) రోజూలాగే  సైకిల్‌పై కాలేజీకి బయలుదేరింది. ఆమె బాన్‌సీదేహ్‌ అనే ప్రాంతంలోకి రాగానే అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు రెండు బైకుల‌పై ఐదుగురు యువ‌కులు వ‌చ్చారు. త‌మ‌తో మాట్లాడాలని ఆమెను వేధించారు. అనంత‌రం ఆమెను కింద‌ప‌డేసి కత్తులతో పొడిచారు. ఆ బాలిక‌ తల్లిదండ్రులు విష‌యాన్ని తెలుసుకుని ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే ఆమె ప్రాణాలు కోల్పోయింద‌ని వైద్యులు చెప్పారు.

  • Loading...

More Telugu News