: జగన్ వైపు వెళ్లకుండా చెక్: ఆనంకు కీలక బాధ్యతలు, రెండు విధాలా లాభం


నెల్లూరు జిల్లాలో కీలక నేతలైన ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో పదవులు లభించకపోవడంతో నిరాశ చెందారని, దీంతో పార్టీ మారే అవకాశం ఉందని జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. దీంతో నెల్లూరు జిల్లాలో పార్టీ పట్టునిలుపుకోవాలంటే వారిద్దరూ చేజారకుండా ఉండడం ముఖ్యమని భావించిన చంద్రబాబు వారికి తన కలల ప్రాజెక్టు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఫైనాన్స్, ప్లానింగ్ లో దిట్టగా పేరుతెచ్చుకున్న ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రన్న బీమా, హౌసింగ్ ప్రాజెక్టులు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ తో వారు పార్టీ మారకుండా, పదవి కోరకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News