: మహిళలతో నగ్నంగా పూజలు చేయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
వరంగల్ జిల్లా వర్థన్నపేటలో క్షుద్రమాంత్రికులు హల్ చల్ చేస్తున్నారు. అంతుబట్టని వ్యాధులు సోకాయని, అందుకే గర్భందాల్చడం లేదని ఆరోపిస్తూ ఒక మంత్రగాడు నగ్నపూజలు నిర్వహించాడు. ఎస్సారెస్పీ కెనాల్ వద్ధ ఈ తతంగం చోటుచేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలంకి చేరుకున్న పోలీసులు...ఒక వ్యక్తి, ఐదుగురు వివాహిత మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారిని పంపేశారు. మంత్రగాడిని మాత్రం మభ్యపెట్టి, మోసం చేయడం కేసులో రిమాండ్ కు పంపారు.