: 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 20 ఎంపీ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ విడుదల


సెల్ఫీ ప్రియుల కోసం ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ జియోనీ 20 మెగాపిక్సెల్‌ ముందు కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను విడుద‌ల చేసింది. జియోనీ ఏ1 లైట్ పేరుతో భార‌త మార్కెట్‌లో విడు‌ద‌లైన ఈ స్మార్ట్‌ఫోన్‌ 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ప‌నిచేస్తుంది. రూ.14,999కి ల‌భ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను రేప‌టి నుంచి భార‌త్‌లోని అన్ని రిటైల్‌ స్టోర్లలో పొంద‌వ‌చ్చు. 5.3 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 7.0 నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 13 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా,  20 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా ఇందులో ఫీచ‌ర్లుగా ఉన్నాయి. 

  • Loading...

More Telugu News