: నేనూ, చిరంజీవి చాలా క్లోజ్: దాసరి
కేంద్రమంత్రి చిరంజీవి, తాను చాలా సన్నిహితులమని దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు అంటున్నారు. నేడు 69వ పడిలో ప్రవేశించిన దాసరి ఓ వార్తా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. చిరంజీవి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తాను బాలకృష్ణకు దగ్గరవుతున్నట్టు వచ్చిన వార్తలను దాసరి ఖండించారు. చిరంజీవితో తాను చాలా క్లోజ్ అని చెప్పుకొచ్చారు.
భార్య మరణం కారణంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యానే తప్ప.. చిరంజీవి పార్టీలోకి రావడం కారణంగా దూరం కాలేదని అన్నారు. చిరంజీవి కాంగ్రెస్ లో చేరిక మంచి పరిణామమని దాసరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవన్న దాసరి.. ఇక తన ప్రాధాన్యత సినిమాలకే అన్నారు.