: కృష్ణా జిల్లాకు సేవలందించాలని ఉంది!: డిప్యూటీ కలెక్టర్ పీవీ సింధు


కొద్దిసేపటి క్రితం విజయవాడ గొల్లపూడిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బాధ్యతలు చేపట్టారు. సీసీఎల్ఏ సెక్రటరీ రామారావు ఎదుట రిపోర్టు చేసిన సింధు, ఆప్షన్స్ లో తనకు కృష్ణా జిల్లా కావాలని కోరారు. కృష్ణా జిల్లాకు తాను సేవలందించాలని భావిస్తున్నట్టు తెలిపిన సింధు, బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని, ప్రస్తుతానికి ఆటపైనే దృష్టిని సారించినట్టు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మెడల్స్ గెలవాలని ఉందని చెప్పారు. ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె, భవిష్యత్తులో ప్రజల సమస్యలను తీర్చేందుకు ఓ అధికారిణిగా తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News