: నంద్యాల కథనంపై... 'ఆంధ్రజ్యోతి'కి నోటీసులు జారీ చేసిన ఈసీ!
ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన కర్నూలు జిల్లా టాబ్లాయిడ్ లో 'ప్రతి నాయకుడు' పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ప్రచురించిన ఈ కథనంపై వైసీపీ శ్రేణులు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అయిన సత్యనారాయణకు ఫిర్యాదు చేశాయి. మరోవైపు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ కథనం ఉన్నట్టు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి కథనం ప్రజాప్రాతినిధ్య చట్టం ఆర్పీ యాక్ట్ సెక్షన్ 127ను ఉల్లంఘించడమే అవుతుందంటూ జిల్లా కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ కథనాన్ని పెయిడ్ న్యూస్ గానే భావిస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.