: జిమ్ లో హీరో రామ్ చరణ్ భార్య వర్కౌట్లు.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. దేహ దారుఢ్యం కోసం చరణ్ చాలా కష్ట పడతాడు. చరణ్ భార్య ఉపాసన గతంలో ఫిట్ నెస్ గురించి ఎక్కువగా పట్టించుకునేది కాదు. అయితే పోలో క్రీడ పట్ల మాత్రం ఆమె అమితాసక్తిని చూపించేది. తాజాగా ఆమె ఫిట్ నెస్ పై దృష్టి సారించింది. ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ను ఏర్పాటు చేసుకుని, అతని సమక్షంలో వర్క్ ఔట్స్ చేస్తోంది. వర్క్ ఔట్స్ చేయడం అంత సులభం కాదని... ఈ 30 రోజుల కాలంలో ట్రైనర్ సహకారంతో ఏమేం చేయగలనో అన్నీ చేస్తానని చెప్పింది.