: రెవెన్యూ లోటు భర్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కేంద్ర సర్కారు!
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. ఏపీ రెవెన్యూ లోటు రూ.4,117.89 కోట్లేనని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. 2014-15 రెవెన్యూ లోటును ఏపీ ప్రభుత్వం గతంలో రూ. 16 వేల కోట్లుగా చెప్పింది. అయితే, ఆ లెక్కలను తాము పరిగణనలోకి తీసుకోమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రానికి ఇప్పటికే రూ. 2,303 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొంది. ఏపీ కొత్త ప్రాజెక్టులకు ఖర్చు చేసిన మొత్తాన్ని లోటుగా పరిగణించలేమని తెలిపింది. అలాగే ఏపీలో రుణమాఫీ, పెన్షన్లు, విద్యుత్ బకాయిల వంటివి కూడా చెల్లించబోమని స్పష్టం చేసింది.