: రోజాకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలి... వైఎస్సార్సీపీ డ్రామా కంపెనీ... రోజాది చింతామణి కేరెక్టర్!: బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు


నంద్యాల ఉపఎన్నికలకు నామినేషన్ పర్వం ముగిసింది. ఎన్నికల సమరం దగ్గర పడుతున్నకొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యక్తిగత దూషణలు, దిగజారుడు వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారు. చంద్రబాబును కాల్చాలని జగన్ సంచలన వ్యాఖ్యలు చేయగా, టీడీపీ నేతలంతా దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. అఖిల ప్రియ డ్రెస్ పై రోజా చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ ఓ డ్రామా కంపెనీలా మారిందని అన్నారు.

వైఎస్సార్సీపీ డ్రామా కంపెనీ అయితే, అందులో రోజాది చింతామణి క్యారెక్టర్ అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో నటించిన రోజా మంత్రి అఖిల ప్రియ డ్రెస్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. సభల్లో పాల్గొనేటప్పుడు రోజాకు ఆల్కహాల్ టెస్ట్ చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చెల్లని చెక్కుల కేసులో రోజా ఎన్నో సార్లు మద్రాసు కోర్టు మెట్లు ఎక్కారని ఆయన విమర్శించారు. అలాంటి రోజాకి టీడీపీ నేతలను విమర్శించే స్థాయి లేదని ఆయన పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News