: విద్యా వ్యవస్థ దీనావస్థకు చేరుకుంది... అవినీతి ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుకు చేరుకుంది: కొరటాల శివ
విద్యా వ్యవస్థ దీనావస్థకు చేరుకుందని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత స్థాయికి దిగజారిందంటే విద్యమీద ఎవరికీ గౌరవం లేదని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థను బాగుచేయాలన్న కోరిక ఎవరిలోనూ లేదని ఆయన చెప్పారు. ప్రజలు రాజకీయాలను, రాజకీయ వ్యవస్థను గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు ఏం చేసినా సరే అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రజలంటే రాజకీయ నాయకులకు చాలా చులకని అని ఆయన చెప్పారు.
ఒక్క బిస్కెట్ వేస్తే ప్రజలంతా నోర్మూసుకుంటారని రాజకీయ నాయకుల అభిప్రాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి ఆల్ టైమ్ గ్రేట్ రికార్డుకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. దానిపై రాజకీయనాయకుల్లో ఒక రూట్ మ్యాప్ లేదని ఆయన చెప్పారు. దేశాన్ని వందల సమస్యలు పట్టిపీడిస్తున్నాయని ఆయన చెప్పారు. వాటిపై ఎందుకు రాజకీయ నాయకులు సరైన స్టాండ్ తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎవరో వస్తారు, దేశాన్ని మార్చేస్తారు..ఇంకెవరో వచ్చేస్తారు, రాష్ట్రాన్ని మార్చేస్తారని ఎదురు చూడడమే కానీ, ఆ ఎవరో రావడానికి ప్రజలు మాత్రం ఏమీ చేయడం లేదని ఆయన చెప్పారు. ప్రజలు మారితే వ్యవస్థ మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.