: రష్యాలో వ్యాన్‌ని ఢీకొట్టిన విమానం... రోడ్డు మీద టేకాఫ్ అవడానికి ప్రయత్నించిన పైలట్.. వీడియో చూడండి
రన్ వే మీద కాకుండా విమానాన్ని రోడ్డు మీద టేకాఫ్ చేయడానికి పైలట్ ప్రయత్నించడంతో అదే రోడ్డు మీద వెళ్తున్న వ్యాన్‌ను వెనక నుంచి ఢీ కొట్టింది. రష్యాలోని చెచన్యా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌తో పాటు, పైలట్ కూడా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. అలాగే ఈ విమానం టేకాఫ్ చేయడానికి ప్రయత్నించిన పైలట్ కి లైసెన్స్ కూడా లేదని పోలీసులు తెలియజేశారు.