: ఆవేదనతోనే చంద్రబాబును కాల్చేయాలనిపిస్తోందన్నాను: ఈసీకి జగన్ వివరణ


నంద్యాల సభలో చంద్రబాబును నిలబెట్టి తుపాకీతో కాల్చేయాలనిపిస్తోందన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎన్నికల కమిషన్ ముందు వివరణ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా హామీలు ఇచ్చారని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా వాటిని పేర్కొన్నారని, అయితే ఆ హామీలు నెరవేర్చడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ఆ ఆవేదనతోనే తాను నంద్యాల బహిరంగ సభలో అలా వ్యాఖ్యానించానని వివరణ ఇచ్చారు. కాగా, నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేయడంతో జగన్ వివరణ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News