niveda thomas: సాయిపల్లవి.. నివేదా థామస్ మధ్య పోటీ తప్పదా?


తెలుగు తెరకి ఈ మధ్యకాలంలో పరిచయమైన కథానాయికల జాబితాలో, నివేదా థామస్ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. అనుపమ పరమేశ్వరన్ .. సాయిపల్లవి పేర్లు కనిపిస్తున్నాయి. అనూ ఇమ్మాన్యుయేల్ చారడేసి కళ్లతో గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అల్లరి పాత్రలకు అనుపమను తీసుకోవచ్చనే టాక్ ఆమె తెచ్చేసుకుంది.

 ఇక నివేదా థామస్ గ్లామర్ పరంగాను .. నటన పరంగాను శభాష్ అనిపించుకుంది. 'జెంటిల్ మేన్' .. 'నిన్నుకోరి' సినిమాలు సహజమైన ఆమె నటనకి అద్దం పట్టాయి .. నానితో ఆమె పోటీపడిన తీరును కళ్లకు కట్టాయి. ఇక 'ఫిదా' సినిమాలో సాయిపల్లవిని చూసినవాళ్లు, పాత్రలో ఒదిగిపోవడమంటే ఇది .. అనేశారు. దాంతో గ్లామర్ తో పాటు నటనకి అవకాశం వుండే పాత్రలు ఈ ఇద్దరి కథానాయికల వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య గట్టిపోటీ ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.    

niveda thomas
sai pallavi
  • Loading...

More Telugu News