: అప్పట్లో నంద్యాలలో రోడ్లు వెడల్పు చేయమని కోరితే చంద్రబాబు అవహేళన చేశారు: అంబటి రాంబాబు


మూడేళ్ల పాలనలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల గురించి ప‌ట్టించుకోలేద‌ని, ఉప ఎన్నికల నేప‌థ్యంలో అభివృద్ధి పేరుతో ఆ నియోజ‌క వ‌ర్గంలో రాజ‌కీయం చేస్తున్నార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు నంద్యాల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాలలో ఈ మూడేళ్ల‌లో రోడ్డు విస్తరణ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. చంద్ర‌బాబుకి నంద్యాల‌లో టీడీపీ ఓడిపోతుంద‌నే భ‌యం పట్టుకుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌మ పార్టీ నేత‌లు మాత్ర‌మే నంద్యాల అభివృద్ధిని కోరుకుంటున్నార‌ని అన్నారు.

నంద్యాల‌ రోడ్లు వెడల్పు చేయమని గతంలో శిల్పా మోహన్‌ రెడ్డి కోరార‌ని, అప్పుడు చంద్ర‌బాబు నిధులు ఎక్కడున్నాయని అవహేళన చేశారని రాంబాబు అన్నారు. 2014లో శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌పై ఏ లాయర్‌ సంతకం చేశారో, ఇప్పుడు కూడా ఆయ‌నే సంతకం చేశారని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీకి ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News