: నవంబర్‌లో హైదరాబాదుకు ట్రంప్ కూతురు ఇవాంకా!
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆహ్వానించిన మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ త్వరలో భారతదేశం విచ్చేయనున్నారు. నవంబర్‌లో హైదరాబాదులో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు ఆమె హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మిట్‌కు నాయకత్వం వహించాల్సిందిగా ప్రధాని మోదీ గతంలో ఆమెను కోరారు.
తనకు ఈ అవకాశం కల్పించినందుకు ఇవాంకా, మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. బిజినెస్ విమెన్‌గా, ఫ్యాషన్ మోడల్‌గా అమెరికాలో పేరు ప్రఖ్యాతులు పొందిన ఇవాంకా ప్రస్తుతం తన తండ్రికి అసిస్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ తన భర్త జేరెడ్ కుష్నర్తో కలిసి ట్రంప్‌కి సలహాలివ్వడానికే ఆమె ప్రాధాన్యమిస్తారు. ఇందుకోసం ఆమె గానీ, తన భర్త గానీ ఎలాంటి జీతభత్యాలు తీసుకోవడం లేదు. స్వతహాగా ఆమెకు 300 మిలియన్ల డాలర్ల ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం.