: జగన్ సభ తర్వాత.. వైసీపీ గబ్బు పట్టిపోయింది: జేసీ దివాకర్ రెడ్డి
నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే, తక్కువ మెజారిటీతో గెలుపొందుతామని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత ఉండటం సర్వసాధారణ విషయమే అని చెప్పారు. నంద్యాలలో చేస్తున్న పనులను ప్రత్యేకంగా చేయడం లేదని అన్నారు. నంద్యాలలో వైసీపీ అధినేత జగన్ సభ తర్వాత... ఆ పార్టీ గబ్బు పట్టిపోయిందని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అపర చాణక్యుడని జేసీ కొనియాడారు. జగన్ పార్టీతో బీజేపీ కలిసే అవకాశమే లేదని... ప్రధాని మోదీకి కొన్ని విలువలు ఉన్నాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీలు కలిసే పని చేస్తాయని తెలిపారు. ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం లేదని చెప్పారు.