: బాలీవుడ్‌కి వెళుతున్న జగ్గూభాయ్?
తన సెకండ్ ఇన్నింగ్స్ లో కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తెలుగు చిత్రసీమలో మంచి ఫామ్‌లో ఉన్న జగపతి బాబు త్వరలో బాలీవుడ్ రంగప్రవేశం చేయనున్నట్లు సమాచారం. ఆయన నటించిన కొన్ని దక్షిణాది సినిమాలు హిందీలోకి అనువాదమవడంతో జగ్గూ భాయ్ నటప్రదర్శనను చూసిన బాలీవుడ్ దర్శకులు ఆయనపై అవకాశాల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.
వాటిలో ఒక దానికి జగపతిబాబు ఓకే చెప్పినట్టు తాజాగా ఆయనే స్వయంగా తెలియజేశారు. అయితే ఆ అవకాశం ఎవరిచ్చారు? ఎవరి సినిమా ద్వారా బాలీవుడ్ రంగప్రవేశం చేయబోతున్నారనే విషయం మాత్రం ఆయన తెలియజేయలేదు. ఇటీవల `పటేల్ సార్` సినిమాతో రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన ఆయన ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న సినిమాలో ఓ కేరేక్టర్ చేస్తున్నారు. ఈ పాత్ర తనకెంతో నచ్చిందని జగపతిబాబు పేర్కొన్నారు.