: డబ్బుతో పాటు గ్రీటింగ్ కూడా పంపొచ్చు... పేటీఎం కొత్త సదుపాయం!
ఇటీవల వచ్చిన పేటీఎం కొత్త అప్‌డేట్ ద్వారా డబ్బుతో పాటు కస్టమైజ్‌డ్ గ్రీటింగ్ కార్డును కూడా పంపే సదుపాయం కల్పించింది. అలాగే `పేటీఎం ఆటోమేటిక్` పేరుతో వాలెట్‌లో డబ్బు ముందే నిర్ణయించిన కనీస పరిమితికి తక్కువగా ఉన్నపుడు ఆటోమేటిక్‌గా వాలెట్‌ను నింపే సదుపాయాన్ని కల్పించింది. కాకపోతే ఈ సదుపాయం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
గ్రీటింగ్ కార్డ్ పంపే సదుపాయం మాత్రం ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉంది. ఫోన్లో ఉన్న కాంటాక్టులకు కూడా డబ్బు పంపుకునే సదుపాయాన్ని పేటీఎం ఇటీవల కల్పించిన సంగతి తెలిసిందే. ఈ గ్రీటింగ్ కార్డు సదుపాయంతో డబ్బు పంపుకునే సౌకర్యానికి కొత్త హంగులు దిద్దనట్లయింది. డబ్బుతో పాటు పంపిన పోస్ట్ కార్డును గ్రహీత 10 రోజుల్లోగా రిడీమ్ చేసుకోకపోతే 100 శాతం డబ్బును తిరిగి పంపిన వారి ఖాతాలోకి పేటీఎం జమ చేస్తుంది.