: మహిళలు ఒంటరిగా ఉంటే వేధించమని ఆహ్వానించినట్టా?: హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడ్ని కడిగిపారేసిన బాధిత యువతి


చండీగఢ్‌ లో సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుందు తన కారులో ఇంటికి వెళ్తుండగా, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్‌ బరాల కొడుకు వికాస్‌ బరాలా, అతని స్నేహితుడు ఆశిష్‌, ఎస్యూవీ వాహనంలో వెంబడించి, అడ్డుకుని వేధింపులకు దిగిన సంగతి తెలిసిందే. సుమారు 8 జంక్షన్ల వరకు ఆమెను వేధించగా, 9 సీసీ టీవీపుటేజ్ లో ఆ వివరాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్ వీర్ స్పందిస్తూ, అర్ధరాత్రి అమ్మాయి ఎందుకు రోడ్లపైకి వెళ్లిందని ప్రశ్నించారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రాగా...వర్ణికా కుందు ఆయన ప్రశ్నలపై మీడియాలో స్పందించారు.

ఆమె మాట్లాడుతూ, 'అలా ప్రశ్నించడం ఆయన పని కాదు. ఎప్పుడు ఎక్కడ, ఏం చేయాలనేది పూర్తిగా నాకు సంబంధించిన విషయం. అలాగే నా కుటుంబానికి సంబంధించిన విషయం. రాత్రి పూట బయటకు వెళ్తే తప్పా? రాత్రి పూట పురుషులు నియంత్రణలో ఉండరా? ఒంటరి మహిళ కనిపించకూడదా? పురుషులు మద్యం తాగొచ్చు, కానీ మహిళ మాత్రం తాగకూడదా? ఒక మహిళ తన స్నేహితులైన అబ్బాయిలతో ఉండి మత్తులో ఉంటే ఆమె లైంగిక వేధింపులకు ఆహ్వానించినట్టా? అసలు బాధితురాలైన నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? నిందితుడ్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ ప్రశ్నలు బాధితురాలైన నన్నడగొచ్చా? ఇంతకీ మీరు సమాజాన్ని ఏ కోణంలో చూస్తున్నారు? నన్ను నేను రక్షించుకున్నాను కాబట్టి ఏదో తప్పయి ఉంటుంది క్షమించండి అంటున్నారు. నాకేదైనా జరిగితే బాధ్యత ఎవరిది?' అంటూ ఆమె కడిగిపారేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు సానుభూతి, అభినందనలు పెద్దఎత్తున వస్తున్నాయి. 

  • Loading...

More Telugu News