: గార్డు నుంచి తుపాకీ లాక్కుని పారిపోయేందుకు ఉగ్రవాది ఎంతగా ప్రయత్నించాడో ఈ వీడియో చూడండి!


బ్యాంకు సెక్యూరిటీ గార్డు నుంచి తుపాకీ లాక్కునిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఘటన కశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో చోటు చేసుకుంది. ఒక బ్యాంకులోకి వినియోగదారుల్లా వచ్చిన ఉగ్రవాదులు, ఎవరికీ అనుమానం రాకుండా వెయిటింగ్ లాంజ్ లో కూర్చున్నారు. కాసేపటి తరువాత బయటకు వెళ్తూ సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న రైఫిల్‌ ను లాక్కునేందుకు ప్రయత్నించారు.

అయితే అప్రమత్తమైన గార్డు రైఫిల్‌ ను వారికి చిక్కనివ్వలేదు. ఈ క్రమంలో ఆయన ఉగ్రవాదులతో పెద్ద పోరాటమే చేశాడు. అయితే అలా లాగుతున్న క్రమంలో ఒక వ్యక్తి డోర్ ను వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. ఈ తతంగమంతా సీసీ టీవీ పుటేజీలో రికార్డయింది. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు....ఆ వీడియో చూడండి. 

  • Loading...

More Telugu News