: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన 103 ఏళ్ల వితంతువు
రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి తన కార్యాలయంలో 103 ఏళ్ల వితంతువు శర్బతీ దేవీ రాఖీ కట్టినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫొటోను పీఎంఓ ట్వీట్ చేసింది. 50 ఏళ్ల క్రితం శర్బతీ దేవీ సోదరుడు చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె ప్రతి రాఖీ పండక్కి తన సోదరుణ్ని గుర్తుచేసుకుని బాధపడుతుండటం గురించి ఆమె కుమారుడు ప్రధానికి లేఖ రాశాడు. ఈ రాఖీ శర్బతీ దేవీకి ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని ఆమెను తన కార్యాలయానికి ఆహ్వానించి తన చేతికి రాఖీ కట్టించుకున్నారు.