: బెడ్ రూం లోంచి.. ఒక్కసారిగా 8 అడుగుల లోతు బావిలో పడిపోయాడు!


బెడ్ రూంలో హాయిగా పడుకుంటే బావిలో ఎలా పడిపోయాడన్న అనుమానం వచ్చిందా? అయితే చదవండి... చెన్నైలోని అంబత్తూర్‌ లోని ఎస్ఎస్వీకె అపార్ట్‌మెంట్ గ్రౌండ్‌ ఫ్లోర్ ఫ్లాట్‌ లో ఎల్ఐసీ ఏజెంట్ చంద్ర శేఖర్ (69) ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. అందులో నివాసం ఉంటున్నారు. అయితే బెడ్ రూంలో హాయిగా పడుకున్న ఆయన అకస్మాత్తుగా కాళ్ల కింద భూమి కుంగిపోవడంతో 8 అడుగుల లోతు బావిలో పడిపోయారు.

దీంతో ఆయన సహాయం కోసం భార్యను పిలవగా, కిచెన్ లో ఉన్న ఆమె వచ్చి అతనిని రక్షించే ప్రయత్నంలో ఉండగా, ఆమె కింద ఉన్న భూమి కూడా కుంగిపోవడంతో ఆమె కూడా ఆ బావిలో పడిపోయారు. దీంతో వారిద్దరూ కేకలు వేయడంతో అపార్ట్ మెంట్ వాసులు వచ్చి ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేశారు. దీంతో వారు వచ్చి వారిని బయటకు తీశారు. అపార్ట్‌ మెంట్ నిర్మించే సమయంలో తవ్విన బావిని బిల్డర్ సరిగా మూయకపోవడంతోనే ఈ ఘటన జరిగి ఉంటుందని అపార్ట్ మెంట్ వాసులు అనుమానిస్తుండగా, మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టారు. 

  • Loading...

More Telugu News