: టీడీపీ అభ్య‌ర్థిపై ఈసీకి కౌంట‌ర్ ఫిర్యాదు దాఖ‌లు చేసిన వైసీపీ


నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిపై వైసీపీ నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌లేద‌ని, ఆదాయ వివ‌రాలు కూడా త‌ప్పులత‌డ‌క‌లుగా ఉన్నాయ‌ని వైసీపీ నేత‌లు ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ అభ్య‌ర్థి శిల్పామోహ‌న్ రెడ్డి నామినేష‌న్‌పై టీడీపీ ఫిర్యాదు చేయ‌డంతో దానికి కౌంట‌ర్‌గా వైసీపీ కూడా టీడీపీ అభ్య‌ర్థిపై ఈసీకి ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీలు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకున్న‌ట్లైంది.

  • Loading...

More Telugu News