: టమోటాలు, ఉల్లిపాయలను బహుమతిగా ఇచ్చిన రఘువీరా!
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి టమోటాలు, ఉల్లిపాయలను రఘువీరా బహుమతిగా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయని విమర్శించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ ద్వారా నిరసన వ్యక్తం చేశారని తెలిపారు.